అన్నమయ్య కీర్తన కొలని దోపరికి
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు |
కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
కొండ గొడుగుగా గోవుల గాచిన |
కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల |
గుండు గండనికి గొబ్బిళ్ళో ||
పాప విధుల శిశుపాలుని తిట్టుల |
కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన |
గోప బాలునికి గొబ్బిళ్ళో ||
దండివైరులను తరిమిన దనుజుల |
గుండె దిగులునకు గొబ్బిళ్ళో |
వెండిపైడి యగు వేంకట గిరిపై |
కొండలయ్యకును గొబ్బిళ్ళో ||